- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sunil Gavaskar: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. టీమిండియాకు సునీల్ గవాస్కర్ కీలక సూచనలు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025)లో భారత్ (India) జైత్రయాత్ర కొనసాగింది.

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025)లో భారత్ (India) జైత్రయాత్ర కొనసాగింది. ఆదివారం దుబాయ్ (Dubai) వేదికగా టీమిండియా (Team India), న్యూజిలాండ్ (New Zealand) తో తలపడతోంది. ఈ క్రమంలోనే మాజీ ఆటగాడు, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) భారత జట్టుకు కీలక సూచనలు చేశారు. గత రెండు మ్యాచ్‌లలో నలుగురు స్పిన్నర్లతో ఆడారని, ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో జట్టును రెడీ చేయాలని అన్నాడు. కొన్ని లోటుపాట్లు, తప్పులను సరిదిద్దుకుంటే టీమిండియాకు ఫైనల్‌లో ఇక తిరుగుండదని తెలిపారు.
ముఖ్యంగా ఓపెనర్ల నుంచి మంచి ఆరంభం రావాలని.. కానీ ఆ విషయంలో కొంత వెనుకబడ్డారని కామెంట్ చేశారు. ముఖ్యమైన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు నుంచి ఆశించిన మేర ప్రదర్శన ఉంటుందనే అశాభావాన్ని వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఇక బౌలింగ్‌లో కొత్త బంతితో వెంటవెంటనే వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాలని సలహా ఇచ్చారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy)తో పాటు కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)లను తుది జట్టులోకి తీసుకోవడం మంచి నిర్ణయమని సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అన్నారు. బౌలర్లు ముఖ్యంగా డాట్ బాల్స్‌పై దృష్టి కేంద్రీకరించాలని సునీల్ గవాస్కర్ తెలిపారు.






