పాకిస్తాన్ కోటలు బద్దలు కొట్టడానికి ఆ ఇద్దరు చాలు - సునీల్ గవాస్కర్

by velandi.Saikiran |

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగనున్న రేపటి మ్యాచ్ పై సునీల్ గవాస్కర్ స్పందించారు.

పాకిస్తాన్ కోటలు బద్దలు కొట్టడానికి ఆ ఇద్దరు చాలు - సునీల్ గవాస్కర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా రేపు పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఆదివారం బిగ్ ఫైట్ జరగనున్న నేపథ్యంలో... రెండు దేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తమ జట్టు గెలుస్తుంది అంటే.. తమ జట్టు గెలుస్తుందని రెండు దేశాల మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్లేయర్లు కూడా ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగనున్న రేపటి మ్యాచ్ పై సునీల్ గవాస్కర్ స్పందించారు. పాకిస్తాన్ ను ఓడించేందుకు అభిషేక్ శర్మ అలాగే గిల్ ఇద్దరు సరిపోతుందని... సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాళ్ళిద్దరూ క్రీజులో నిలదొక్కుకుంటే టీమిండియా భారీ స్కోర్ చేయడం గ్యారంటీ అని అంచనా వేశారు. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదన్నారు. ఒకవేళ వీళ్ళిద్దరూ త్వరగా అవుట్ అయినప్పటికీ... మిగతా ప్లేయర్లు తమ పని ఫినిష్ చేస్తారని స్పష్టం చేశారు. రేపటి మ్యాచ్ లో కచ్చితంగా టీమిండియా గెలుస్తుందని తేల్చి చెప్పారు.

Next Story