- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND VS SA: గిల్ స్థానంలో ఎవరికి ఛాన్స్..ఆ ఇద్దరి మధ్యే పోటీ..?
సాయి సుదర్శన్ ను తీసుకుంటే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు. మరి కొంతమంది దేవదత్ పడిక్కల్ ను

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో కెప్టెన్ గిల్ గాయపడిన సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్ లో మెడనొప్పి కారణంగా అర్ధాంతరంగా తప్పుకున్నాడు గిల్. ప్రస్తుతం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గిల్, టీమిండియా ప్లేయర్లతో పాటు హోటల్ గదిలోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల ప్రకారం రెండో టెస్టుకు కూడా గిల్ ఆడే అవకాశాలు లేనట్లే అని ప్రచారం సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో గిల్ స్థానంలో బరిలోకి ఎవరు దిగుతారన్న దానిపైన చర్చ జరుగుతుంది.
అయితే అనిల్ కుంబ్లే లాంటి సీనియర్ ప్లేయర్లు మాత్రం గిల్ స్థానంలో సాయి సుదర్శన్ ను తీసుకుంటే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు. మరి కొంతమంది దేవదత్ పడిక్కల్ ను ( Devdutt Padikkal) తుది జట్టులోకి తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. గతంలో సాయి సుదర్శన్ కు అవకాశాలు ఇచ్చినప్పటికీ అతడు వినియోగించుకోలేదన్న విమర్శలు ఎక్కువగానే ఉన్నాయి. అందుకే దేవదత్ పడిక్కల్ కు అవకాశం ఇవ్వాలని డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఇది ఇలా ఉండగా, నవంబర్ 22వ తేదీన టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య గౌహతి వేదికగా రెండో టెస్టు జరగనుంది.






