Ind vs Pak: దుబాయ్ స్టేడియంకు వచ్చే అభిమానులకు షాక్.. 3 నెలల జైలు శిక్ష,భారీ ఫైన్!

by velandi.Saikiran |

3 నెల‌ల పాటు జైలు శిక్ష ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. అలాగే... లక్ష నుంచి రూ. 7 లక్షల వరకు జరిమానా విధించవచ్చని

Ind vs Pak: దుబాయ్ స్టేడియంకు వచ్చే అభిమానులకు షాక్.. 3 నెలల జైలు శిక్ష,భారీ ఫైన్!
X

దిశ‌, వెబ్ డెస్క్ : టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మరికొన్ని క్షణాల్లోనే మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది. ఇవాళ రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో దుబాయ్ స్టేడియానికి వచ్చే అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది దుబాయ్ పోలీస్ శాఖ.

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉన్న నేపథ్యంలో.. భద్రతాపరమైన సమస్యలు వస్తాయని.. అక్కడి పోలీస్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ప్లేయర్ల పైకి అభిమానులు దూసుకువ‌స్తే.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. జెండాలు, బ్యానర్లు, గొడుగులు, పెద్ద కెమెరాలు, సెల్ఫీ స్టిక్‌లు, మండే పదార్థాలు, పదునైన వస్తువులను స్టేడియంలోకి అనుమతించబోరు. వీటిలో దేనినైనా తీసుకెళితే...3 నెల‌ల పాటు జైలు శిక్ష ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. అలాగే... లక్ష నుంచి రూ. 7 లక్షల వరకు జరిమానా విధించవచ్చని పోలీసులు తెలిపారు.

Next Story