ఆడాలని ఉన్నా.. సెలెక్టర్లు స్పందించడం లేదు : Ajinkya Rahane

by Harish |   (  Updated:2025-07-12 15:12:45  IST  )

టెస్టు క్రికెట్‌లోకి పునరాగమనంపై భారత సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానె‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఆడాలని ఉన్నా.. సెలెక్టర్లు స్పందించడం లేదు : Ajinkya Rahane
X

దిశ, స్పోర్ట్స్ : టెస్టు క్రికెట్‌లోకి పునరాగమనంపై భారత సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానె‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకు టెస్టు క్రికెట్ ఆడటం చాలా ఇష్టమని, కానీ సెలెక్టర్లు స్పందించడం లేదన్నాడు. లార్డ్స్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు రహానె హాజరయ్యాడు. మూడో రోజు లంచ్ సమయంలో రహానె అక్కడి మీడియాతో మాట్లాడాడు. భారత్ తరపున టెస్టు క్రికెట్ ఆడాలనే తన బలమైన కోరికను వ్యక్తం చేశాడు. ‘నేను ఇంకా టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నా. టెస్టు క్రికెట్‌ అంటే నాకు చాలా మక్కువ. నిజాయితీగా చెబుతున్నా సెలెక్టర్లతో మాట్లాడా. కానీ, ఎలాంటి సమాధానం రాలేదు. నేను చేయగలిగేది ఆడటం మాత్రమే. నాకు టెస్టు క్రికెట్ అంటే ఇష్టం. రెడ్ బాల్ ఆడటం ఇష్టం.’అని రహానె తన మనసులోని మాటలను బయటపెట్టాడు. అలాగే, విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి తన కెప్టెన్సీకి ఉన్న వ్యత్యాసాన్ని రహానె వివరించాడు. ‘ప్రతి కెప్టెన్‌కు జట్టు నడిపించడంలో సొంత శైలి ఉంటుంది. నేను కెప్టెన్ అయ్యాక నా శైలికి, నా ఆలోచనలకు కట్టుబడి ఉన్నా.’అని రహానె చెప్పుకొచ్చాడు. 2023లో ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ తరపున చివరిసారిగా ఆడాడు. ఆ తర్వాత రహానె టెస్టు జట్టులో కోల్పోయాడు. ఫామ్ లేమితో ఇబ్బందిపడటంతోపాటు యువ క్రికెటర్లు దూసుకరావడంతో రహానెకు స్థానం కరువైంది. ఇకపై అతను తిరిగి టెస్టు జట్టులోకి రావడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story