- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క మ్యాచ్‌తో స్టార్‌డమ్! ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ ప్రఫుల్ ఫాలోవర్ల సంఖ్యలో రికార్డు
సన్‌రైజర్స్ విజేత ప్రఫుల్ హింగే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1,723 నుండి 101K కు జంప్! ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఫిదా.. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad,), రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఓ వైపు సన్ రైజర్స్ బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించగా.. మరోవైపు యువ బౌలర్లు రాజస్థాన్ జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించి వికెట్ల వర్షం కురిపించారు. దీంతో సన్ రైజర్స్ జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే రాజస్థాన్ ఆల్ అవుట్ చేసి.. 57 పరుగుల తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. కాగా ఈ మ్యాచుతో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ 4 వికెట్లతో రికార్డు సృష్టించారు.
దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ బౌలర్ ప్రఫుల్ హింగే (Praful Hinge) సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్‌గా మారారు. నిన్నటి మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో జట్టుకు విజయం అందించిన ప్రఫుల్‌కు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మ్యాచ్ ముగిసిన కొద్ది గంటల్లోనే ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరగడం విశేషం. ఈ మ్యాచుకు ముందు ప్రఫుల్ (@prafulhinge_140) ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కేవలం 1,723 ఉండగా.. మ్యాచ్ తర్వాత ఏకంగా 101K (ఒక లక్షకు పైగా) కు చేరుకుంది. అంటే, ఒక్క మ్యాచ్‌తోనే సుమారు లక్ష మంది కొత్త ఫాలోవర్లు ఆయన ఖాతాకు చేరారు. ఇది ప్రఫుల్ సాధించిన ప్రజాదరణకు, ఫ్యాన్స్ ఆయనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నిదర్శనం.
అలాగే సోషల్ మీడియాలో కూడా సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ప్రఫుల్ హింగేపై ప్రశంసల వర్షం (A shower of praise) కురిపిస్తున్నారు. ఒక వైరల్ మీమ్‌లో (Meme) బాహుబలి ప్రభాస్ ఫోటోను ఉపయోగిస్తూ ఫ్యాన్స్ తమ స్పందనను ఇలా తెలియజేశారు. ఫాలోవర్ల సంఖ్య పెరగడమే కాకుండా, ప్రఫుల్ బయోలో కూడా "IPL- @sunrisershyd", "Professional cricketer", "Vidarbha cricket association" అని ఉన్న సమాచారం ఆయన గుర్తింపును మరింత పెంచుతోంది. ఒకే మ్యాచ్‌తో ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో స్థానం సంపాదించుకున్న ప్రఫుల్, రాబోయే మ్యాచుల్లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.






