- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ సమీపిస్తోన్న వేళ స్టార్ ప్లేయర్ షాకిచ్చారు. సౌతాఫ్రికన్ స్టార్ డుప్లెసిస్(Faf du Plessis) ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పారు. 14 సీజన్ల తర్వాత ఈ ఏడాది వేలంలో పాల్గొనట్లేదని పోస్ట్ చేశారు. తన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీ కోచ్, తోటి ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. వచ్చే పాకిస్తాన్ సూపర్ లీగ్ సీజన్‌లో మాత్రం ఆడనున్నట్లు పేర్కొన్నారు. డుప్లెసిస్ ఐపీఎల్ కెరియర్‌లో చెన్నై సూపర్ కింగ్స్, పూణే, ఆర్సీబీ, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. 154 మ్యాచుల్లో 4,773 పరుగులు చేశారు. కాగా, ఇప్పటికే వన్డేలు, టెస్టులు, టీ20 ఫార్మాట్లకు ఫాఫ్ డుప్లెసిస్ విడ్కోలు పలికిన విషయం తెలిసిందే. నిత్యం నూతనంగా కనిపిస్తూ.. ఆటకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ కొనసాగారు. రిటైర్ అయ్యే వయసులో కూడా పరుగుల వర్షం కురిపించిన ఫాఫ్‌ను మిస్ అవుతామని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






