రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాట్స్‌మేన్

by Disha Web Desk 2 |
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాట్స్‌మేన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్‌మెన్ షాన్ మార్ష్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకనుంచి కేవలం టీ20ల్లో మాత్రమే కొనసాగాలని ఫిక్స్ అయ్యారు. 2001లో ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి మార్ష్ అడుగుపెట్టాడు. 2022లో ప్రతిష్టాత్మక షెఫీల్డ్ షీల్డ్‌ ట్రోఫీని సారథిగా ఆస్ట్రేలియాకు అందించాడు. ఆస్ట్రేలియా తరపున 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ20 మ్యాచ్‌లు ఆడారు. టెస్టుల్లో 2,265, వన్డేల్లో 2,773, టీ20ల్లో 255 పరుగులు చేశాడు. కాగా, షాన్ మార్ష్ సోదరుడు మిచెల్ మార్ష్ ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులోని అని ఫార్మాట్లలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు.


Next Story

Most Viewed