- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB: చిన్నస్వామి ఘటనకు అసలు కారణం ఇదే !
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ( Royal Challengers Bengaluru) విజయోత్సవ ర్యాలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి

దిశ, వెబ్ డెస్క్: రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ( Royal Challengers Bengaluru) విజయోత్సవ ర్యాలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం ( Chinnaswamy Stadium) దగ్గర.. విపరీతంగా అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. చిన్న స్వామి స్టేడియంలో లోపలికి వెళ్లేందుకు.. అభిమానులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే తొక్కి సలాట జరిగి దాదాపు పది మంది మరణించారని తెలుస్తోంది. మరో 37 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పదిమందికి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే ఈ ఘటనకు కారణం ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు. దీనికి కారణం భద్రత సిబ్బంది లోపం ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నస్వామి స్టేడియం వద్ద... సరైన సమయంలో... గేట్లు తెరవలేదని సమాచారం అందుతుంది. అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించి గేట్లు తెరవలేదట. దీంతో వెనుక నుంచి ఒత్తిడి ఎక్కువై... తొక్కిసలాట జరిగినట్లు సమాచారం అందుతుంది.
ఈ నేపథ్యంలో.. అభిమానులు గేట్లను తోసుకుంటూ ముందుకు దూసుకు వచ్చారు. అభిమానులు ముందుకు రావడంతో... రెచ్చిపోయిన పోలీసులు లాఠీ ఛార్జ్ మొదలుపెట్టారు. దీంతో చూస్తుండగానే విషాదం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో RCB పరేడ్ కూడా రద్దు చేసింది కర్ణాటక సర్కార్. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






