- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2025లో చిన్నస్వామి తొక్కిసలాట ఒక్కటే కాదు.. మరో 3 కూడా!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా.... ఫ్యాన్స్ మధ్య తొక్కిసలాట జరిగి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా.... ఫ్యాన్స్ మధ్య తొక్కిసలాట జరిగి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఏకంగా 11 మంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు మృతి చెందారు. మరో 33 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారికంగా ప్రకటించారు. ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
18 సంవత్సరాల తర్వాత... టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును అందరూ విమర్శించే తరహాలో ఈ సంఘటన జరగడం గమనార్హం. బెంగళూరుకు టైటిల్ రావడంతోనే ఈ ఘటన జరిగిందని.. ఒక్క టైటిల్ కారణంగా.. 11 మంది మృతి చెందినట్లు సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే... ఈ సంవత్సరంలో జరిగిన తొక్కి సలాట సంఘటనల గురించి ఓ వార్త వైరల్ గా మారింది. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు అత్యంత ప్రమాదకరమైన తొక్కిసలాటలు జరిగాయి.
ఇందులో మొదటిది జనవరి మాసంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో జరిగింది. తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించడం ఇదే తొలిసారి. అటు ప్రయాగ్ రాజ్ లో కూడా జనవరి మాసంలో తొక్కిసలాట జరిగింది. అప్పుడు కూడా పదుల సంఖ్యలో భక్తులు మరణించారు. ఇక కుంభమేళ నేపథ్యంలో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో కూడా ఫిబ్రవరి మాసంలో తొక్కిసలాట అడ్డ జరిగింది. అప్పుడు కూడా చాలామంది మరణించారు. తాజాగా చిన్న స్వామి స్టేడియం వేదికగా కూడా.. తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. ఇలా వివిధ సంఘటనలలో అమాయకపు జనాలు మృతి చెందారు.
Stampede Incidents This Year.. pic.twitter.com/KfuF8mipe4
— RVCJ Media (@RVCJ_FB) June 4, 2025






