Virat Kohli : తొక్కిసలాట ఘటన... కోహ్లీపై కేసు నమోదు!

by Muthe.Rajitha |

బెంగళూరు తొక్కిసలాట(Bengaluru Stampede) ఘటనలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది.

Virat Kohli : తొక్కిసలాట ఘటన... కోహ్లీపై కేసు నమోదు!
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరు తొక్కిసలాట(Bengaluru Stampede) ఘటనలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఘటనకు కారణం అంటూ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న భారీ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్ 2025 విజయోత్సవ ర్యాలీ(Victory Parade) సందర్భంగా జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇప్పటికే RCB, DNA ఈవెంట్ మేనేజ్‌మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(KSCA)లపై కేసు నమోదైంది.

తాజాగా ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat kohli)పై పోలీసులకు ఫిర్యాదు అందింది. స్టేడియం వద్ద తొక్కిసలాటకు కోహ్లీ కూడా కారణమని ఆరోపిస్తూ.. తక్షణమే ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవాలని కోరుతూ రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ కబ్బన్ పార్కు పీఎస్ లో కంప్లైంట్ చేశారు. అయితే కోహ్లీ మీద కేసు నమోదు చేయడం సాధ్యమా? కాదా? అనే దానిపై పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నారు.

Next Story