శ్రీకాంత్ జోరు.. మలేసియా మాస్టర్స్‌లో సెమీస్‌కు క్వాలిఫై

by Harish |

మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది.

శ్రీకాంత్ జోరు.. మలేసియా మాస్టర్స్‌లో సెమీస్‌కు క్వాలిఫై
X

దిశ, స్పోర్ట్స్ : మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడు విజయాన్ని నమోదు చేసిన మెన్స్ సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో శ్రీకాంత్ ఫ్రాన్స్‌కు చెందిన టోమా జూనియర్ పొపొవ్‌ను మట్టికరిపించాడు.హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 24-22, 17-21, 22-20 తేడాతో విజయం సాధించాడు. క్వార్టర్స్‌ను దాటేందుకు శ్రీకాంత్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఫ్రాన్స్ ఆటగాడు ఓటమి నుంచి బయటపడేందుకు శక్తి మేరకు పోరాడాడు. అయితే, తొలి గేమ్ నెగ్గిన శ్రీకాంత్ మ్యాచ్‌లో శుభారంభం చేశాడు. రెండో గేమ్‌‌లో ప్రత్యర్థి ఆధిపత్యం ప్రదర్శించి పోటీలోకి వచ్చాడు. కానీ, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు గట్టి పోటీనిచ్చినప్పటికీ శ్రీకాంత్‌నే విజయం వరించింది. సెమీస్‌లో జపాన్ ప్లేయర్ టనాకాతో శ్రీకాంత్ తలపడనున్నాడు. ఇక, మిక్స్‌డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో-ధ్రువ్ కపిల జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్‌లో భారత జంట 22-24, 13-21 తేడాతో చైనాకు చెందిన జియాంగ్-వెయ్ చేతిలో పరాజయం పాలై ఇంటిదారిపట్టింది.


Next Story