ఆ భారత మాజీ క్రికెటర్‌ను కోచ్‌గా నియమించిన సీఎస్కే.. ప్రత్యేకంగా వారి కోసమేనా?

by Harish |

భారత మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్‌ను చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే) అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంది.

ఆ భారత మాజీ క్రికెటర్‌ను కోచ్‌గా నియమించిన సీఎస్కే.. ప్రత్యేకంగా వారి కోసమేనా?
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్‌ను చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే) అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంది. వచ్చే సీజన్‌ కోసం హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మైఖేల్ హస్సీ(బ్యాటింగ్ కోచ్), ఎరిక్ సిమోన్స్(బౌలింగ్ కన్సల్టెంట్)‌లతో కూడిన కోచింగ్ స్టాఫ్‌లో శ్రీరామ్ చేరనున్నాడు. 49 ఏళ్ల శ్రీరామ్ భారత్ తరపున మూడు వన్డేలు ఆడాడు. అలాగే, ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(2010), ఢిల్లీ క్యాపిటల్స్(2011)లకు ప్రాతినిధ్యం వహించాడు. అతనికి విస్తృతమైన కోచింగ్ అనుభవం ఉంది. ఆస్ట్రేలియా జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా, ఆ తర్వాత బంగ్లాదేశ్ టెన్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్, లక్నో జట్లకు పనిచేశాడు. సీఎస్కే జట్టులో అశ్విన్, జడేజా, శ్రేయాస్ గోపాల్, నూర్ అహ్మద్‌లతో కూడిన స్పిన్ విభాగాన్ని శ్రీరామ్ పర్యవేక్షిస్తాడు. ఐపీఎల్-2025లో సీఎస్కే మార్చి 23న తొలి మ్యాచ్‌లో ముంబైతో తలపడనుంది.


Next Story