T20 వరల్డ్‌కప్‌: ఫస్ట్ మ్యాచ్‌లోనే గ్రేట్ క్యాచ్ (వీడియో)

by Disha Web Desk 2 |
T20 వరల్డ్‌కప్‌: ఫస్ట్ మ్యాచ్‌లోనే గ్రేట్ క్యాచ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన మొదటి మ్యాచే రికార్డులు సృష్టించింది. పసికూన నమీబియా చేతిలో ఆసియా కప్ విజేత అయిన శ్రీలంక జట్టు ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై నమీబియా 55 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 19 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. అయితే, ఈ మ్యాచ్‌లో శ్రీలంక కీపర్ కుషాల్ మెండీస్ అదిరిపోయే క్యాచ్ పట్టాడు. నమీబియా ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో కరుణరత్నే వేసిన ఆఫ్ సైడ్ బంతిని బ్యాటర్ నికోల్ లోఫ్టీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ, బంతి ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ వైపునకు వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ కుషాల్ మెండిస్ డైవ్ చేసి బంతిని ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా నమీబియా బ్యాటర్ షాక్ అయి పెవీలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేయగా.. అదికాస్త వైరల్‌గా మారింది.



Next Story

Most Viewed