- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T20WorldCup2026: శ్రీలంక అద్భుత విజయం.. మళ్లీ ఓడిపోయిన ఆస్ట్రేలియా
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగింది. శ్రీలంకలోని పల్లకీల మైదానం వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక జట్లు తలపడ్డాయి.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగింది. శ్రీలంకలోని పల్లకీల మైదానం వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక(Australia vs Sri Lanka) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాతుమ్ నిశాంక 52 బంతుల్లో 100 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇందులో పది ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి. కుషాల్ మెండీస్(51) కూడా హాఫ్ సెంచరీతో రాణించారు. 28 పరుగులతో పరవాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టోయినీస్ ఒక్కడే రెండు వికెట్లు తీశారు. మిగిలిన బౌలర్లంతా విఫలం అయ్యారు. ఈ ఓటమితో ఆస్ట్రేలియా సూపర్-8కు వెళ్లడం కష్టంగా మారబోతోంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (54), ట్రావిస్ హెడ్ (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. కామెరూన్ గ్రీన్ (3), టిమ్ డేవిడ్ (6), మార్కస్ స్టాయినిస్ (4), కూపర్ (3) విఫలమయ్యారు. జోష్ ఇంగ్లిస్ (27), గ్లెన్ మాక్స్‌వెల్ (22) ఫర్వాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో దుషాన్ హేమంత 3.. చమీర, తీక్షణ, దునిత్, మెండిస్ తలో వికెట్ తీశారు. చివరి ఓవర్‌లో రెండు రనౌట్లు సహా మూడు వికెట్లను ఆసీస్ కోల్పోయింది.






