పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే.. మహిళల వరల్డ్ కప్ నుంచి ఔట్

by Harish |

మహిళల వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన మూటగట్టుకుంది.

పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే.. మహిళల వరల్డ్ కప్ నుంచి ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : మహిళల వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన మూటగట్టుకుంది. ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించకుండా టోర్నీని ముగించిన ఏకైక జట్టు పాకే కావడం గమనార్హం. ఇప్పటికే ఎలిమినేట్ అయిన బాధలో ఉన్న పాక్‌కు ముగింపు కూడా కలిసిరాలేదు. కొలంబోలో శుక్రవారం శ్రీలంక‌తో జరగాల్సిన ఆఖరి మ్యాచ్‌ వర్షార్పణమైంది. కేవలం 26 బంతుల ఆట మాత్రమే సాగింది. మ్యాచ్ ప్రారంభానికి కంటే ముందు నుంచి వర్షం పడింది. దీంతో టాస్ ఆలస్యమైంది. 37 ఓవర్లకు కుదించి ఆటను ప్రారంభించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 4.2 ఓవర్లలో 18/0 స్కోరు చేసింది. మళ్లీ వర్షం రావడంతో ఆట ముందుకు సాగలేదు. 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని చూసినా సాధ్యపడలేదు. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. కొలంబోలో వర్షాలు ప్రపంచకప్‌కు తీవ్ర అంతరాయం కలిగించాయి. అక్కడ 11 మ్యాచ్‌లు జరిగితే అందులో 5 మ్యాచ్‌లు రద్దయ్యాయి. పాక్ తమ 7 మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడగా.. మరో మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి.


Next Story