ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘన విజయం

by Ajay Maddhiboyina |

చరిత అసలంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘన విజయం
X

- తొలి వన్డేలో సమిష్టిగా రాణించిన లంకేయులు

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 0-2తో కోల్పోయిన శ్రీలంక జట్టు.. వన్డేల్లో శుభారాంభం చేసింది. రెండు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం కొలంబోలో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక జట్టు ఆసీస్‌ను 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 46 ఓవర్లలో కేవలం 214 పరుగులకే ఆలౌట్ అయ్యింది. శ్రీలంక టాప్ ఆర్డర్ పూర్తిగా చేతులెత్తేయడంతో ఒకానొక దశలో 100 పరుగులైనా దాటుతుందా అనే అనుమానం కలిగింది. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ చరిత్ అసలంక అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 126 బంతుల్లో 5 సిక్సులు, 14 ఫోర్లతో 127 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ దునిత్ వెల్లలగే (30) రాణించాడు. టెయిలెండర్లు కూడా విఫలం చెందడంతో కేవలం 46 ఓవర్లే ఆడి 214 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో సీన్ అబాట్ మూడు వికెట్లు తీయగా..స్పెన్సర్ జాన్సన్, ఆరోన్ హార్డీ, నాథన్ ఎల్లిస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. మాథ్యూ షార్ట్ ఒక వికెట్ తీసాడు. ఇక 215 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు 33.5 ఓవర్లలో 165 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. మార్నల్ లబుషేన్ (41), ఆరోన్ హర్డీ (32) తప్ప ఎవరూ రాణించలేదు. శ్రీలంక బౌలర్ మహీష తీక్షణ 4 వికెట్లు తీసి శ్రీలంక విజయంలో కీలక పా్తర పోషించాడు. చరిత అసలంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Next Story