- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్-8 ముంగిట శ్రీలంకకు ఎదురుదెబ్బ.. టోర్నీ నుంచి కీలక ప్లేయర్ అవుట్
టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 దశకు చేరుకున్న తరుణంలో, శ్రీలంక ప్రధాన పేసర్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: వెటరన్ ప్లేయర్ జయసూర్య (Jayasurya) హెడ్ కోచ్ నేతృత్వంలో టీ20 ప్రపంచకప్-2026లో శ్రీలంక (Srilanka) జట్టు అదరగొడుతోంది. ఈ క్రమంలోనే ఆ జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. టోర్నీలో ప్రధాన పేసర్ మతీషా పతిరన (Matisha Pathirana) గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే సూపర్-8 దశకు చేరుకున్న లంకకు ఇది కోలుకేలేని విషయమే. ప్రధాన డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద మైనస్‌గా మారింది.
సూపర్-8లో బలమైన జట్లు..
ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లో కేవలం నాలుగు బంతులు వేశాడు. ఎడమ కాలి పిక్క కండరాల నొప్పితో (Calf Strain) అతను మైదానంలోనే కుప్పకూలాడు. నొప్పితో విలవిలలాడిన పతిరనను ఫిజియోలు మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. తాజాగా నిర్వహించిన స్కాన్ రిపోర్టులో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని.. అతడు రికవర్ కావడానికి కనీసం 3 నుంచి 4 వారాల సమయం పడుతుందని తేలింది. ఇప్పటికే స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా (Vanindu Hasaranga), పేసర్ ఇషాన్ మలింగ (Ishan Malinga) గాయాలతో టోర్నీకి దూరం కాగా, ఇప్పుడు పతిరన కూడా చేరడంతో శ్రీలంక బౌలింగ్ విభాగం బలహీనపడింది. మరోవైపు సూపర్-8 రౌండ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి బలమైన జట్లతో శ్రీలంక తలపడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ప్రధాన బౌలర్ లేకపోవడం జట్టు వ్యూహాలను దెబ్బతీస్తుంది. ఇక పతిరన స్థానాన్ని భర్తీ చేసేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ముగ్గురు ఆటగాళ్ల పేర్లను పరిశీలిస్తోంది దిల్షాన్ మధుశంక, బినుర ఫెర్నాండో, నువాన్ తుషార ఉన్నారు.






