- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జింబాబ్వే సంచలన విజయం.. శ్రీలంకకు షాక్
శ్రీలంకతో టీ20 సిరీస్‌లో జింబాబ్వే సంచలన విజయం సాధించింది.

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంకతో టీ20 సిరీస్‌లో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. శనివారం జరిగిన రెండో టీ20లో 5 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లంక జట్టు.. జింబాబ్వే బౌలర్లను ఎదుర్కోలేకపోయింది. 17.4 ఓవర్లలో 80 పరుగులే చేసి ఆలౌటైంది. కమిల్ మిశ్రా చేసిన 20 పరుగులే ఆ జట్టులో టాప్ స్కోర్. నిసాంక(8), కుసాల్ మెండిస్(1), కెప్టెన్ అసలంక(18), కామిందు మెండిస్(0), షనక(15) వంటి టాప్ ప్లేయర్లు నిరాశపరిచారు. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా, బ్రాడ్ ఎవన్స్ చెరో 3 వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించగా.. ముజారాబాని 2 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం లక్ష్యాన్ని జింబాబ్వే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 14.2 ఓవర్లలో 84 రన్స్ చేసింది. ర్యాన్ బుర్ల్(20 నాటౌట్), తషింగ ముసెకివా(21 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. తొలి టీ20లో శ్రీలంక గెలవగా.. ఆ ఓటమికి ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ప్రతీకారం తీర్చుకుంది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. నేడు సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 జరగనుంది.






