స‌న్ రైజ‌ర్స్ కు బిగ్ రిలీఫ్‌..ఆ డేంజ‌ర్ ప్లేయ‌ర్ వ‌చ్చేస్తున్నాడు

by velandi.Saikiran |

SRHకు సంబంధించిన స్టార్ బౌలర్ ఎషాన్ మలింగ ( Eshan Malinga) ఐపీఎల్ 2026లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

స‌న్ రైజ‌ర్స్ కు బిగ్ రిలీఫ్‌..ఆ డేంజ‌ర్ ప్లేయ‌ర్ వ‌చ్చేస్తున్నాడు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 ప్రారంభానికి కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో బౌలర్ల కోసం టెన్షన్ పడుతున్న హైదరాబాద్ జట్టుకు బిగ్ రిలీఫ్ దక్కింది. SRHకు సంబంధించిన స్టార్ బౌలర్ ఎషాన్ మలింగ ( Eshan Malinga) ఐపీఎల్ 2026లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. ఇటీవల కాలంలో ఎషాన్ మలింగకు గాయమైంది. ఈ తరుణంలో అతడు ఆడటం కష్టమే అన్నారు. కానీ లేటెస్ట్ గా శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఫిట్ నెస్‌ క్లియరెన్స్ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఎషాన్ మలింగ, సన్ రైజర్స్ హైదరాబాద్ శిబిరంలో చేరబోతున్నాడు.

దీంతో హైదరాబాద్ కు భారీ ఊరట లభించనుంది. స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ ఆడే మొదటి దశ మ్యాచ్ లకు కెప్టెన్ కమిన్స్ దూరమవుతున్న సంగతి తెలిసిందే. అతడు మళ్లీ ఎప్పుడు వ‌స్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ ఇచ్చారు కావ్య మారన్. కాగా ఐపీఎల్ 2026లో బెంగళూరుతో తన తొలి మ్యాచ్ ఆడనుంది సన్ రైజర్స్. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్న హైదరాబాద్, బౌలింగ్ తో కాస్త వీక్ గా కనిపిస్తోంది. లేటెస్ట్ గా ఎషాన్ మలింగ వస్తున్న నేపథ్యంలో కాస్త ఊరట లభించే ఛాన్స్ ఉంది.

Next Story