- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SRH Vs RR: హై-వోల్టేజ్ ‘ఎలిమినేటర్’ మ్యాచ్.. టాస్ గెలిచిన సన్‌రైజర్స్
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2026 ప్లేఆఫ్స్ సమరం మరింత రసవత్తరంగా మారింది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య హై-వోల్టేజ్ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్-2కు దూసుకెళ్తుంది, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అయితే, టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
హోరాహోరీగా ఇరు జట్ల బలాబలాలు..
పాట్ కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో అత్యంత దూకుడుగా ఆడుతూ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్‌లతో కూడిన హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ భీకరమైన ఫామ్‌లో ఉంది. మరోవైపు, ముంబై ఇండియన్స్‌పై ఘన విజయంతో 4వ స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన రాజస్థాన్ రాయల్స్ కూడా అంతే కసిగా ఉంది. ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్న యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ, జోఫ్రా ఆర్చర్లపై రాజస్థాన్ భారీ ఆశలు పెట్టుకుంది. రెండు జట్లలోనూ విధ్వంసకర ఆటగాళ్లు ఉండటంతో ముల్లన్‌పూర్ పిచ్‌పై భారీ స్కోర్ల మ్యాచ్ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ అభిమానులంతా తమ ‘ఆరెంజ్ ఆర్మీ’ విజయం సాధించి క్వాలిఫైయర్-2కు వెళ్లాలని కోరుకుంటున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (WK), హెన్రిచ్ క్లాసెన్, స్మరన్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(C), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే.
రాజస్థాన్ రాయల్స్ జట్టు: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్ (WK), రియాన్ పరాగ్(C), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్‌రాజ్ పుంజా.






