SRH Vs HCA: ఎస్ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ తీవ్ర ఆరోపణలు.. HCA సెన్సేషనల్ స్టేట్‌మెంట్

by Kema Shiva Kumar |

ఐపీఎల్ (IPL) కొనసాగుతోన్న వేళ ఎస్ఆర్‌హెచ్ (SRH) టీమ్ మేనేజ్‌మెంట్, హెచ్‌సీఏ (Hyderabad Cricket Association) మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది.

SRH Vs HCA: ఎస్ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ తీవ్ర ఆరోపణలు.. HCA సెన్సేషనల్ స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఐపీఎల్ (IPL) కొనసాగుతోన్న వేళ ఎస్ఆర్‌హెచ్ (SRH) టీమ్ మేనేజ్‌మెంట్, హెచ్‌సీఏ (Hyderabad Cricket Association) మధ్య వివాదం ముదురుతోంది. ఈ క్రమంలోనే ‘ఐపీఎల్ ఉచిత టిక్కెట్ల కోసం HCA తమను చంపుకుతింటోందని.. ఈ బాధలు పడలేమని.. పరిస్థితుల్లో మార్పు రాకపోతే మరోచోటికి తమ హోం గ్రౌండ్‌ను ఛేంజ్ చేసుకుంటామని ఎస్ఆర్‌హెచ్ జీఎం శ్రీనాథ్ (GM Sridhar) రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. హెచ్‌సీఏ (HCA) అధ్యక్షుడు కూడా తమను పలుమార్లు బెదిరించారని ఆయన ఆరోపించారు.

అయితే ఆ లేఖ బయటకు వచ్చిన క్షణాల్లోనే.. హెచ్‌సీఏ సంచలన స్టేట్‌మెంట్ చేసింది. ఎస్ఆర్‌హెచ్ (SRH) టీమ్ మేనేజ్‌మెంట్ చేసి ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదంటూ హెచ్‌సీఏ ప్రెసిడెంట్ కార్యాలయం నుంచి నోట్ విడుదలైంది. అందులో SRH యాజ‌మాన్యం నుంచి తమకు ఎలాంటి అధికారిక ఈ-మెయిల్స్ (Emails) రాలేదని స్పష్టం చేసింది. సోష‌ల్ మీడియా (Social Media)తో పాటు కొన్ని వెబ్‌సైట్లలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపడేసింది. ఒక‌వేళ నిజంగా ఈ-మెయిలే (Email) వ‌చ్చుంటే.. ఆ విషయం HCA లేదా SRH అధికారిక ఈ-మెయిల్ నుంచి కాకుండా గుర్తుతెలియ‌ని ఐడీ నుంచి లీక్ చేయ‌డం వెనుకున్న కుట్ర ఏంటని ప్రశ్నించింది. హెచ్‌సీఏ, ఎస్ఆర్‌హెచ్ ప్రతిష్టను దిగజార్చేందుకు కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని దుష్ర్పచారం చేస్తు్న్నారని. అసలు ఈ-మెయిల్స్ నిమమైనవేనా.. ఫేకా తెలుసుకునేందుకు SRH మేనేజ్‌మెంట్ నుంచి కూడా మీడియా వివ‌ర‌ణ తీసుకోవాలని హెచ్‌సీఏ ప్రెసిండెంట్ ఆఫీస్ నోట్ విడుదల చేసింది.

Next Story