SRH vs GT ఐపీఎల్ మ్యాచ్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?

by Muthe.Rajitha |   (  Updated:2025-04-06 17:44:37  IST  )

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు హైదరాబాద్ సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్(SRH vs GT) మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరుగుతోంది.

SRH vs GT ఐపీఎల్ మ్యాచ్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు హైదరాబాద్ సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్(SRH vs GT) మధ్య మ్యాచ్ జరుగుతోంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత హైదరాబాద్ బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. SRH జట్టులో నితీశ్ కుమార్ 31, క్లాసెన్ 27, కమిన్స్ 22, అభిషేక్ 18, అనికేత్ 18, ఇషాన్ 17 పరుగులు చేశారు. సన్ రైజర్స్ టాప్ బ్యాటర్స్ మరోసారి దారుణంగా విఫలం అయ్యారు. గుజరాత్ బౌలర్స్ లో సిరాజ్ 4 వికెట్లు, ప్రసిద్ద్, సాయి కిషోర్ తలా రెండు వికెట్లు తీశారు. తరువాతి ఇన్నింగ్స్ లో గుజరాత్ 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

Next Story