- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SRH Vs CSK: కట్టుదిట్టంగా బౌలింగ్.. విజయం దిశగా సన్‌రైజర్స్!
ఐపీఎల్-2026లో భాగంగా ఉప్పల్ వేదిగా ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనాసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2026లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. తొలత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, సన్‌రైజర్స్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొత్తం 22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అనంతరం మిడిల్ ఆర్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 59) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ట్రావిస్ హెడ్ 23 పరుగులతో రాణించగా, చివర్లో శివాంగ్ కుమార్ (12) మెరుపులు మెరిపించాడు. అయితే, భారీ స్కోరు దిశగా సాగుతున్న SRHను అన్షుల్ కాంబోజ్ (3/22), జేమీ ఓవర్టన్ (3/37) తమ బౌలింగ్‌తో కట్టడి చేశారు. ముకేష్ చౌదరికి 2 వికెట్లు దక్కాయి.
కష్టాల్లో చెన్నై సూపర్ కింగ్స్..
195 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఆయుష్ మాత్రే (30) మెరుపులు మెరిపించినా, స్టార్ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్ (19), సంజూ శాంసన్ (7) నిరాశపరిచారు. సన్‌రైజర్స్ బౌలర్లు నితీష్ కుమార్ రెడ్డి, ఈశాన్ మలింగ రెండేసి వికెట్లు తీసుకుని పదునైన బౌలింగ్‌తో చెన్నై వికెట్లను వరుసగా పడగొట్టారు. ప్రస్తుతం 12.2 ఓవర్లలో CSK 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. క్రీజులో శివం దూబే, మాట్ షార్ట్ ఉన్నారు. చెన్నై గెలవాలంటే చివరి 46 బంతుల్లో 78 పరుగులు చేయాల్సి ఉంది. ఉప్పల్ స్టేడియం మొత్తం హోరెత్తుతుండటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.






