SRH Vs CSK: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. బ్యాటింగ్ ఫస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-18 13:42:23  IST  )

చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.

SRH Vs CSK: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. బ్యాటింగ్ ఫస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2026లో భాగంగా చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కావడంతో హోరాహోరీ పోరు తప్పది విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌‌లో ధోని బరిలోకి దిగుతాడని జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. అతడు ఇంకా ఫిట్‌గా లేడని కెప్టెన్ రుతురాజ్ తెలిపారు. సీఎస్కే ఒకే ఒక్క మార్పుతో.. ఎస్‌ఆర్‌హెచ్ సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: సంజు శాంసన్ (WK), రుతురాజ్ గైక్వాడ్ (C), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(WK), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(C), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే.

Next Story