IPL 2026 : హోమ్‌గ్రౌండ్‌లో చివరి మ్యాచ్.. SRH బ్యాటర్ల విధ్వంసం

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం SRH vs RCB మ్యాచ్ ప్రారంభమవ్వగా.. హైదరాబాద్ జట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు.

IPL 2026 : హోమ్‌గ్రౌండ్‌లో చివరి మ్యాచ్.. SRH బ్యాటర్ల విధ్వంసం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం SRH vs RCB మ్యాచ్ ప్రారంభమవ్వగా.. హైదరాబాద్ జట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు. హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న చివరి మ్యాచ్ కావడంతో.. బౌండరీలతో అభిమానులకు వినోదాన్ని పంచారు. 20 ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ (79), అభిషేక్ శర్మ (56), క్లాసెన్ (51) హాఫ్ సెంచరీలతో రాణించారు. నితీశ్ రెడ్డి 29, హెడ్ 26 పరుగులు చేశారు. హై ఓల్టేజీ మ్యాచులో RCB ఈ భారీ స్కోరును ఎలా ఛేదిస్తుందో చూడాలి. విజయం తమదంటే తమదంటూ అటు SRH, ఇటు RCB అభిమానులు ధీమాగా ఉన్నారు.

Next Story