ఉగ్రదాడి మృతులకు SRH, MI ప్లేయర్స్ సంతాపం

by Muthe.Rajitha |   (  Updated:2025-04-23 15:36:26  IST  )

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalgoan Terror Attack)లో మృతులకు ఐపీఎల్ ప్లేయర్లు సంతాపం ప్రకటించారు.

ఉగ్రదాడి మృతులకు SRH, MI ప్లేయర్స్ సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalgoan Terror Attack)లో మృతులకు ఐపీఎల్ ప్లేయర్లు సంతాపం ప్రకటించారు. ఈ సీజన్లో నేడు హైదరాబాద్ సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్(SRH vs MI) జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్(Hyderabad) లోని ఉప్పల్ వేదిక(Uppal Stadium)గా జరుగుతున్న ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు SRH, MI జట్ల ప్లేయర్లు, సిబ్బంది, ఎంపైర్లు పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులు(Tributes) అర్పిస్తూ.. 2 నిముషాలు మౌనం పాటించారు. దాడికి నిరసనగా ఇరు జట్లు చేతికి నల్ల బ్యాడ్జ్ లు ధరించారు. అదే విధంగా ఈరోజు జరగనున్న మ్యాచ్ లో ఛీర్ లీడర్స్ మెరుపులు, మ్యూజిక్ సిస్టమ్ వంటి ఎలాంటి సెలెబ్రేషన్స్ లేకుండానే మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించారు. కాగా జమ్ముకాశ్మీర్లోని(Jammu Kashmir) పహల్గామ్ లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టుల మీద కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది మరణించగా.. మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Next Story