SRH బౌలర్ల విధ్వంసం.. ఢిల్లీ స్కోర్ ఎంతంటే?

by Muthe.Rajitha |

ఐపీఎల్(IPL 2025) లో భాగంగా నేడు ఉప్పల్ వేదిక(Uppal Stadium)గా హైదరాబాద్, ఢిల్లీ(SRH vs DC) జట్లు తలపడుతున్నాయి.

SRH బౌలర్ల విధ్వంసం.. ఢిల్లీ స్కోర్ ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్(IPL 2025) లో భాగంగా నేడు ఉప్పల్ వేదిక(Uppal Stadium)గా హైదరాబాద్, ఢిల్లీ(SRH vs DC) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలచి ఫీల్డింగ్ ఎంచుకున్న SRH జట్టు బౌలర్స్ ఢిల్లీ జట్టుకు చుక్కలు చూపించారు. 7 ఓవర్లకు 26 పరుగుల మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీసి ఢిల్లీమీ ఘోరంగా దెబ్బతీశారు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే కీలక వికెట్లు కోల్పోయి DC పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. ట్రిస్టన్ (43), అశుతోష్ శర్మ (41) మాత్రమే జట్టు స్కోర్ 100 దాటేలా చేశారు. హైదరాబాద్ జట్టులో కమిన్స్ 3 వికెట్లు తీయగా.. జయదేవ్, హర్షల్, మలింగ తలా ఒక వికెట్ తీశారు. కాగా 134 టార్గెట్ తో SRH మరికొద్దిసేపట్లో బ్యాటింగ్ కు దిగనుంది.

Next Story