- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరల్డ్ కప్‌లో సత్తా చాటిన తెలుగమ్మాయి..కడపలో బ్యానర్లు
9 మ్యాచ్ లు ఆడిన శ్రీ చరణి.. ఏకంగా 14 వికెట్లు పడగొట్టింది. దీంతో ఈ టోర్నమెంట్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన నాలుగో బ

దిశ, వెబ్ డెస్క్: వన్డే వరల్డ్ కప్ ( Womens World Cup 2025) విజేతగా టీమిండియా నిలిచింది. 2025 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా రెండు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో 52 పరుగులతో విజయం సాధించిన టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఈ టోర్నమెంట్ లో కడపకు చెందిన శ్రీ చరణి ( Sree Charani) అనే తెలుగు అమ్మాయి అద్భుత ప్రదర్శన కనబరిచింది. నిన్న ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా గెలవడంలో కూడా తన కృషి ఎంతో ఉంది.
టోర్నమెంట్ మొత్తంగా 9 మ్యాచ్ లు ఆడిన శ్రీ చరణి.. ఏకంగా 14 వికెట్లు పడగొట్టింది. దీంతో ఈ టోర్నమెంట్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్ గా శ్రీ చరణి నిలిచారు. 22 వికెట్లతో తొలి స్థానంలో దీప్తి శర్మ ఉన్న సంగతి తెలిసిందే. అయితే మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీ చరణి ఆడిన నేపథ్యంలో కడపలో పెద్ద పెద్ద బ్యానర్లు వెలిశాయి. టీమిండియాలో కడప అమ్మాయి ఆడడం గర్వకారణంగా ఉందని, బ్యానర్లు ఏర్పాటు చేశారు లోకల్ యువత.






