- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Squash : చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారిగా ప్రపంచకప్ టైటిల్ కైవసం
by Harish |
స్క్వాష్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది.

X
దిశ, స్పోర్ట్స్ : స్క్వాష్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. తొలిసారిగా స్క్వాష్ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో భారత జట్టు బలమైన హాంకాంగ్‌ను ఓడించి టైటిల్ దక్కించుకుంది. చెన్నయ్‌లో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో హాంకాంగ్‌పై 3-0 తేడాతో విజయం సాధించింది. టోర్నీ ఆద్యంతం భారత జట్టు సంచలన ప్రదర్శన చేసింది. ఒక్క మ్యాచ్ కూడా కోల్పోలేదు. ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ముందుగా జోష్న చినప్ప శుభారంభం చేసింది. ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో లీ కా యిపై 7-3, 2-7,7-5, 7-1తేడాతో గెలిచింది. ఆ తర్వాత మెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో అభయ్ 7-1, 7-4, 7-4తో అలెక్స్ లావుపై ఏకపక్ష విజయం సాధించడంతో భారత్2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక మరో ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో అనాహత్ సింగ్ 7-2, 7-2, 7-5తో టొమాటో హోను చిత్తు చేయడంతో భారత్ విజయం లాంఛనమైంది.
Next Story






