ఆఫ్ఘనిస్తాన్ బ్యాడ్‌లక్.. సౌతాఫ్రికా ‘సూపర్’ విక్టరీ..

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-11 09:51:29  IST  )

టీ20 ప్రపంచకప్‌లో ఆసక్తికర మ్యాచ్ జరిగింది.

ఆఫ్ఘనిస్తాన్ బ్యాడ్‌లక్.. సౌతాఫ్రికా ‘సూపర్’ విక్టరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2026)లో ఆసక్తికర మ్యాచ్ జరిగింది. బుధవారం గుజరాత్‌లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా సౌతాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్(South Africa vs Afghanistan) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎక్కడా నమ్మకం కోల్పోకుండా అద్భుతంగా రాణించింది. 19.4 ఓవర్లో సరిగ్గా 187 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో సూపర్ ఓవర్ వేయాల్సి ఉంది. అయితే అనూహ్యంగా సూపర్ ఓవర్‌లోనూ రెండు జట్లు 17 - 17 పరుగులు చేశాయి. దీంతో రెండో సూపర్ ఓవర్ వేయాల్సింది. ఈ రెండో సూపర్ ఓవర్లో సౌతాఫ్రికా బ్యాటర్లు అదగొట్టారు. ఆరు బంతుల్లో ఏకంగా 23 పరుగులు చేశారు. 24 పరుగుల లక్ష్య చేధనలో ఆప్ఘాన్ బ్యాటర్లు సైతం రఫ్పాడించారు. ఆరు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి.. 19 పరుగులు చేశారు. దీంతో సౌతాఫ్రికా విజయం సాధించింది.

Next Story