- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Heinrich Klaasen: హెన్రిచ్ క్లాసెన్ రిటైర్మెంట్... 33 ఏళ్ళ వయసులోనే
దక్షిణాఫ్రికా ( South Africa) డేంజర్ ప్లేయర్, సన్ రైజర్స్ విధ్వంసకర బ్యాటర్ హేన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) తన అభ

దిశ, వెబ్ డెస్క్ : దక్షిణాఫ్రికా ( South Africa) డేంజర్ ప్లేయర్, సన్ రైజర్స్ విధ్వంసకర బ్యాటర్ హేన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఎవరు అంచనా వేయని నిర్ణయం తీసుకున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు... కాసేపటి క్రితమే ప్రకటించాడు ఈ డేంజర్ ఆటగాడు హేన్రిచ్ క్లాసెన్. 33 సంవత్సరాల వయసులోనే... అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు క్లాసెన్.
దీంతో ఆయన అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా షాక్ అవుతున్నారు. పిన్నవయసులోనే స్టార్ ఆటగాడు హేన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకడం ఏ మాత్రం బాగాలేదని... ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు క్రికెట్ అభిమానులు. ఇది ఇలా ఉండగా దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటి వరకు 60 వన్డేలు ఆడిన హేన్రిచ్ క్లాసెన్ ... 58 టీ20 లకు ప్రాతినిధ్యం వహించాడు.
అలాగే నాలుగు టెస్టులు మాత్రమే దక్షిణాఫ్రికా జట్టు తరఫున ఆడాడు. ఇందులో నాలుగు వన్డే సెంచరీలు నమోదు చేయగా.. మొత్తం పరుగులు 3245 మాత్రమే చేశాడు. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు హేన్రిచ్ క్లాసెన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. విధ్వంసకర బ్యాటింగ్ నేపథ్యంలో... జట్టులో కాటేరమ్మ కొడుకుగా బాగా పాపులర్ అయ్యాడు హేన్రిచ్ క్లాసెన్.






