- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > WTC Final 2025: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. విశ్వవిజేతగా నిలుపుతారా?
WTC Final 2025: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. విశ్వవిజేతగా నిలుపుతారా?
by Gantepaka Srikanth |
అత్యంత కీలకమైన మ్యాచ్‌లో సౌతాఫ్రికా(South Africa) బ్యాటర్లు అదరగొడుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అత్యంత కీలకమైన మ్యాచ్‌లో సౌతాఫ్రికా(South Africa) బ్యాటర్లు అదరగొడుతున్నారు. లండన్‌లోని లార్ట్స్(Lord's) వేదికగా ఆస్ట్రేలియా(Australia), సౌతాఫ్రికా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత ఆసిస్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ ఇన్సింగ్స్‌లో 212, సెకండ్ ఇన్సింగ్స్‌లో 207 పరుగులు చేసింది. మొత్తంగా సౌతాఫ్రికా ఎదుట 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన సఫారీలు అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(06), వియాన్ (27) విఫలం అయినా.. ఆ తర్వాత వచ్చిన మార్కరమ్ (90), కెప్టెన్ బవూమా(51) జట్టును ఆదుకున్నారు. సౌతాఫ్రికా విశ్వవిజేతగా నిలిచేందుకు ఇంకా 97 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయిన సఫారీలు 185 పరుగులు చేశారు.
Next Story






