- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెస్టుల్లో కొనసాగుతున్న సౌతాఫ్రికా జోరు.. మరో భారీ విజయం
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (world test championship ) అయిన తర్వాత దక్షిణాఫ్రికా ( South Africa) ఏ మాత్రం తగ్గడం లేదు.

దిశ, వెబ్ డెస్క్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (world test championship ) అయిన తర్వాత దక్షిణాఫ్రికా ( South Africa) ఏ మాత్రం తగ్గడం లేదు. వరుసగా టెస్ట్ మ్యాచ్ లు గెలుచుకుంటూ ముందుకు వెళ్తోంది. WTC టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత... వరుసగా రెండు మ్యాచులు విజయం సాధించింది దక్షిణాఫ్రికా. తాజాగా జింబాబ్వే పై ఏకంగా 236 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది సౌత్ ఆఫ్రికా.
మొదటి మ్యాచ్ లో జింబాబ్వే పై ( Zimbabwe) 328 పరుగుల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఇప్పుడు 236 పరుగుల తేడాతో రెండో టెస్ట్ కూడా కైవసం చేసుకుంది. ఈ రెండు టెస్ట్ లో మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఐదు వికెట్ నష్టపోయి 626 పరుగులు చేసింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 170 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఫాలో ఆన్ ఆడింది జింబాబ్వే ( Zimbabwe).
ఈ రెండో ఇన్నింగ్స్ లో 220 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో రెండో మ్యాచ్ లో కూడా... దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ తరుణంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ... టెస్టుల్లో తన జోరు కొనసాగిస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాగే ఆడితే... దక్షిణాఫ్రికా ను ఆపే దమ్ము ఎవరికీ ఉండదని అంటున్నారు.






