- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T20WorldCup2026: న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గుజరాత్‌లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా జట్టు విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గుజరాత్‌లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా జట్టు విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లను మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. కెప్టెన్ ఐదెన్ మార్‌క్రమ్ (86) సూపర్ ఇన్నింగ్స్‌తో సఫారీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. క్వింటన్ డికాక్ (20), రికెల్టన్ (21), డేవాల్డ్ బ్రెవిస్ (21), డేవిడ్ మిల్లర్ (24*) రాణించారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.
అంతకుముందు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మార్క్ చాప్‌మన్ (48), డారిల్ మిచెల్ (32), ఫిన్ అలెన్ (31), జేమ్స్ నీషమ్ (23*) రాణించారు. టిమ్ సీఫెర్ట్ (13), రచిన్ రవీంద్ర (13), మ్యాట్ హెన్రీ (8*), మిచెల్ సాంట్నర్ (4), గ్లెన్ ఫిలిప్స్ (1) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో యాన్సెస్ 4.. ఎంగిడి, బాష్, కేశవ్ తలో వికెట్ తీశారు.






