- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WTC 2025 Final: నెరవేరిన కల.. విశ్వవిజేతగా నిలిచిన సౌతాఫ్రికా
ఎన్నో ఏళ్ల కల. ఎన్నో ఏళ్ల కష్టం. ఎట్టకేలకు నెరవేరింది. సౌతాఫ్రికా(South Africa) అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ తరుణం రానే వచ్చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఏళ్ల కల. ఎన్నో ఏళ్ల కష్టం. ఎట్టకేలకు నెరవేరింది. సౌతాఫ్రికా(South Africa) అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ తరుణం రానే వచ్చేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్స్ షిప్-2025(World Test Championship 2025) ఫైనల్లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఆస్రేలియా(Australia) నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఒక రోజు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్ సఫారీలంతా యూనిటీగా రాణించారు. బౌలింగ్‌లో రబాడా(నాలుగు వికెట్లు), లుంగి ఎంగిడి(మూడు వికెట్లు) రాణించగా, బ్యాటింగ్‌లో మార్కరమ్(136 పరుగులు), కెప్టెన్ బవూమా (66 పరుగులు), వల్డర్(27 పరుగులు), డెవిడ్ బెడింఘమ్(21 రన్స్)తో రాణించి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించారు. మొత్తంగా 83 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, హేజుల్ వుడ్, వెబ్‌స్టర్ తలో వికెట్ తీశారు. దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సఫారీలు ఐసీసీ ట్రోఫీ గెలవడం విశేషం.
ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్సింగ్స్ : 212/10
సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్సింగ్స్ : 138/10
ఆస్ట్రేలియా సెకండ్ ఇన్సింగ్స్ : 207/10
సౌతాఫ్రికా సెకండ్ ఇన్సింగ్స్ : 282/5






