ప్రపంచ రికార్డు నెలకొల్పిన దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్..

by Disha Web Desk 12 |
ప్రపంచ రికార్డు నెలకొల్పిన దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్..
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి మొత్తం 35 సిక్సర్లు కొట్టాయి. దీంతో టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన మ్యాచ్ గా నిలవడమే కాకుండా మునపటి రికార్డులను బద్దలు కొట్టింది. కాగా గతంలో రికార్డు 2022 జూన్ 26న నమోదైంది. బల్గేరియా, సెర్బియా మధ్య జరిగిన మ్యాచ్‌లో 33 సిక్సర్లు నమోదయ్యాయి. అలాగే దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీ20 అత్యధిక పరుగులు కూడా నమోదయ్యాయి. మొత్తం రెండు జట్టు కలిసి ఈ మ్యాచ్‌లో 517 పరుగులు నమోదయ్యాయి.

Next Story

Most Viewed