- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా పర్యటనను భారత మహిళల క్రికెట్ జట్టు ఓటమితో మొదలుపెట్టింది. డర్బన్‌లో శుక్రవారం జరిగిన తొలి టీ20లో హర్మన్‌ప్రీత్ సేన 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 రన్స్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్(47 నాటౌట్), రోడ్రిగ్స్(36), షఫాలీ వర్మ(34) రాణించారు. అయితే, ఛేదన సౌతాఫ్రికాకు కూడా సులభంగా ఏం లేదు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు కూడా పోరాడాల్సి వచ్చింది. కానీ, కెప్టెన్ లారా వొల్వార్డ్(51), డెర్క్సెన్(44 నాటౌట్) సత్తాచాటడంతో దక్షిణాఫ్రికా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకబడింది. ఆదివారం రెండో టీ20 జరగనుంది.
Next Story






