నేడు తొలి సెమీ ఫైనల్... దక్షిణాఫ్రికాకు లక్ కలిసి వస్తుందా?

by velandi.Saikiran |

ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీ ఫైనల్ ఉంటుంది.

నేడు తొలి సెమీ ఫైనల్... దక్షిణాఫ్రికాకు లక్ కలిసి వస్తుందా?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో ఇవాళ తొలి సెమీ ఫైనల్ పోరు జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీ ఫైనల్ ఉంటుంది. 2024 టోర్నమెంట్ సమయంలో ఫైనల్ దాకా వెళ్లి భారత చేతిలో సౌతాఫ్రికా ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలన్న కసితో సెమీ ఫైనల్ లాగా వచ్చింది సౌతాఫ్రికా. దానికి త‌గ్గ‌ట్టుగానే సౌతాఫ్రికాకు ల‌క్ క‌లిసివస్తోంది. అటు న్యూజిలాండ్ కూడా టైటిల్ గెలవాలన్న ఆత్రుతతో ఉంది.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు షురూ కానుంది. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ప్రోటీస్, న్యూజిలాండ్ రెండు జట్ల మధ్య 19 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో అడ్వాంటేజ్ సౌతాఫ్రికాకు ఉంది. 12 మ్యాచ్ లు సౌతాఫ్రికా విజయం సాధించగా.. న్యూజిలాండ్ కేవలం ఏడు మ్యాచ్ ల్లో గెలుపొందింది. గత రికార్డులు చూసుకున్నట్లయితే సౌతాఫ్రికాకు అడ్వాంటేజ్ ఉండనుంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి. అటు రేపు భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ ముంబై వేదికగా ఉంటుంది. గెలిచిన జట్లు ఫైనల్ కు చేరుతాయి. మార్చి 8వ తేదీన వరల్డ్ కప్ ఫైనల్ ఉంటుంది.

Next Story