- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WTC Final 2025: కొత్త జెర్సీతో బరిలోకి దక్షిణాఫ్రికా
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కు ( ICC World Test Championship Final, 2025) రంగం సిద్ధమవుతోంది. ఈ టోర్న

దిశ, వెబ్ డెస్క్: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కు ( ICC World Test Championship Final, 2025) రంగం సిద్ధమవుతోంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్... మరో 20 రోజుల్లోనే జరగనుంది. 11వ తేదీ నుంచి ఐదు రోజులపాటు అంటే జూన్ 15వ తేదీ వరకు ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో సౌత్ ఆఫ్రికా అలాగే ఆస్ట్రేలియా జట్టు తలపడతాయి. లండన్ లోని లార్డ్స్ వేదికగా... వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2025 జరగనుంది.
ఈ మేరకు షెడ్యూల్ ఇప్పటికే ఖరారు అయింది. ఇలాంటి నేపథ్యంలో... ఇప్పటికే తమ జత సభ్యులను ప్రకటించిన దక్షిణాఫ్రికా కీలక నిర్ణయం తీసుకుంది. WTC ఫైనల్ కోసం కొత్త జెర్సీని విడుదల చేసింది దక్షిణాఫ్రికా క్రికెట్ యాజమాన్యం. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా ఈ కొత్త జెర్సీ ని ధరించి ఫోటోషూట్ లో పాల్గొన్నారు. దీంతో ఈ కొత్త జెర్సీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దక్షిణాఫ్రికా జట్టు: టోనీ డి జోర్జి, ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్‌రామ్, టెంబా బావుమా (సి), డేవిడ్ బెడింగ్‌హామ్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్, కగిసో రబడ, లుంగీ ఎన్‌గిడి, డేన్ ముతురాజామ్, కేస్హవ్ పటర్సన్, కేస్హవ్ ప్యాటర్సన్.
South Africa unveil their WTC Final jersey! 🇿🇦💚#WTCFinal #CricketSouthAfrica #WTC25 #SAvsAUS #TembaBavuma #CricketTwitter pic.twitter.com/dw7jgFq7yo
— InsideSport (@InsideSportIND) May 20, 2025






