- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సౌతాఫ్రికా సిరీస్.. పంత్ ఇన్.. కోహ్లీ, రోహిత్ ఔట్
సౌతాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు టీం ఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ.

దిశ, వెబ్ డెస్క్ : సౌతాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు టీం ఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. ఇ సిరీస్ కి శుభమన్ గిల్ నాయకత్వం వహించనుడగా.. రిషబ్ పంత్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు జట్టు వైస్ కెప్టెన్ గా బాధ్యతలు కూడా చేపట్టనున్నాడు. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ బ్యాటర్లుగా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్లుగా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, ఆకాశ్ దీప్ బౌలర్లుగా జట్టులో చోటు దక్కించుకున్నారు.
భారత్ వన్డే - ఏ జట్టు ఇదే..
అంతేకాదు సౌతాఫ్రికా-ఏ తో జరగనున్న భారత్ వన్డే - ఏ జట్టును కూడా ప్రకటించింది బీసీసీఐ. ఈ జట్టుకు తిలక్ కెప్టెన్ కాగా, రుతురాజ్ వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు. అభిషేక్, పరాగ్, ఇషాన్, బదోని, నిశాంత్, వి నిగమ్, ఎం సుతార్, హర్షిత్, అర్షదీప్, ప్రసిద్ధ్, ఖలీల్, ప్రభ్ సిమ్రాన్ లు జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ జట్టులో కోహ్లీ, రోహిత్ లకు మాత్రం చోటు దక్కకపోవడం గమనార్హం.






