పాకిస్తాన్ ఎలిమినేట్‌..న్యూజిలాండ్ తో టీమిండియా మ్యాచ్‌..ఓడితే ఇంటికే!

by velandi.Saikiran |

మహిళల వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కథ ముగిసింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గని మహిళల

పాకిస్తాన్ ఎలిమినేట్‌..న్యూజిలాండ్ తో టీమిండియా మ్యాచ్‌..ఓడితే ఇంటికే!
X

దిశ‌, వెబ్ డెస్క్ : మహిళల వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కథ ముగిసింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గని మహిళల పాకిస్తాన్ జట్టు, ఇంటి దారి పట్టింది. నిన్న దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగగా, సఫారీలు అద్భుత విజయం దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ లో 150 పరుగుల తేడాతో పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్ లో ఓటమి నేపథ్యంలో అధికారికంగా ఈ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది. ఇప్పటికే బంగ్లాదేశ్ కూడా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. శ్రీలంక కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మూడు జ‌ట్లు ఇప్పటికే సెమీస్ కు దూసుకువెళ్లాయి. నాలుగో స్థానం కోసం ఇండియాతో పాటు న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఉంది. ఇందులో టీమిండియా గెలిస్తే సెమీస్ అవకాశాలను మరింత పెంచుకుంటుంది. దీంతో పాటు బంగ్లాదేశ్ పైన కూడా ఓ మ్యాచ్ టీమ్ ఇండియా గెలవాల్సి ఉంటుంది. ఇలా వరుసగా రెండు మ్యాచ్ లలో టీం ఇండియా గెలిస్తేనే, సెమీస్ కు వెళుతుంది. ఇందులో ఒక్కటి ఓడిపోయినా టీమిండియా ఇంటి దారి పట్టడమే. క్లిక్







Next Story