- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరగదీసిన పాండ్యా, తిలక్..ఇండియా భారీ స్కోర్
దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్ లో భారత జట్టు భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో కేవలం 5 వికెట్లు

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్ లో భారత జట్టు భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో కేవలం 5 వికెట్లు నష్టపోయి 231 పరుగులు సాధించింది భారత జట్టు. మన బ్యాటర్లందరూ విజృంభించి ఆడారు. దీంతో దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్ ఉంచింది సూర్య సేన. హార్దిక్ పాండ్యా 25 బంతులు 63 పరుగులు చేసి, సఫారీలకు చుక్కలు చూపించాడు. అటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 42 బంతుల్లోనే 73 పరుగులు చేసి రఫ్ ఆడించాడు. గిల్ స్థానంలో వచ్చిన సంజు శాంసన్ కూడా తగ్గేదేలే అన్నట్లు 37 పరుగులు చేసి దుమ్ము లేపాడు. అటు అభిషేక్ శర్మ 34 పరుగులతో రాణించాడు. చివరలో శివం దూబే మెరుపులు మెరిపించాడు. ఇక ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలవాలంటే 232 పరుగులు చేయాలి. ఇందులో భారత జట్టు గెలిస్తే, 3-1 తేడాతో సిరీస్ గెలవడం గ్యారెంటీ. ఒకవేళ ఓడితే, సిరీస్ సమం అవుతుంది.






