- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెచ్చిపోయిన హార్దిక్ పాండ్యా..భారత్ స్కోర్ ఎంతంటే
హార్దిక్ పాండ్యా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 28 బంతుల్లో 59 పరుగులు సాధించిన హార్దిక్ పాండ్యా

దిశ, వెబ్ డెస్క్: కటక్ వేదికగా జరుగుతోన్న మొదటి టీ20 మ్యాచ్ లో భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్ల దెబ్బకు మొదట కాస్త తడబడినప్పటికీ, హార్దిక్ పాండ్యా రెచ్చిపోవడంతో భారీ స్కోరు సాధించింది భారత్. ఈ మ్యాచ్ లో 20 ఓవర్లు ఆడిన భారత జట్టు, 6 వికెట్లు నష్టపోయి 175 పరుగులు సాధించింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 28 బంతుల్లో 59 పరుగులు సాధించిన హార్దిక్ పాండ్యా, భారత్ ను ఆదుకున్నాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు ఆరు బౌండరీలు కూడా సాధించాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్ తో అదరగొట్టాడు. అటు ఈ మ్యాచ్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన గిల్ నాలుగు పరుగులకే ఔట్ అయ్యాడు. అభిషేక్ శర్మ 17 పరుగులు సాధించగా, కెప్టెన్ సూర్య 12, తిలక్ వర్మ 26, అక్షర్ పటేల్ 53 పరుగులు సాధించారు. శివం దూబే 11, జితేష్ శర్మ 10 పరుగులు చేశారు. ఇక ఈ మ్యాచ్ లో 20 ఓవర్లలో 176 పరుగులు సాధిస్తే, దక్షిణాఫ్రికా విజయం సాధిస్తుంది.






