- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాస్ మార్క్రమ్.. డబ్ల్యూటీసీ టైటిల్‌కు 69 పరుగుల దూరంలో సఫారీలు
డబ్ల్యూటీసీ టైటిల్‌కు 69 పరుగుల దూరంలో సఫారీలు నిలిచారు. కీలక సమయంలో సెంచరీతో మార్క్రమ్, ఫిఫ్టీతో బవుమా అదరగొట్టారు.

దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సఫారీలు చరిత్ర సృష్టించేందుకు సిద్దమవుతున్నారు. నాలుగో ఇన్నింగ్సులో 282 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఆ జట్టు.. మరోసారి ఫైనల్‌లో ఓడిపోయేలా కనిపించింది. ఆ టీం కెప్టెన్ టెంబా బవుమా (65 నాటౌట్), టీ20 కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (102 నాటౌట్) అద్భుతమైన ఆటతీరుతో జట్టును విజయం దిశగా నడిపిస్తున్నారు. ముఖ్యంగా మార్క్రమ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో కీలకమైన సమయంలో సెంచరీతో చెలరేగాడు. నాలుగో రోజు కూడా తొలి రెండు సెషన్స్‌లో వీళ్లిద్దరూ రాణిస్తే.. ఈసారి డబ్ల్యూటీసీ ఛాంపియన్‌గా సఫారీలు నిలవడాన్ని ఎవరూ అడ్డుకోలేరు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా తడబడుతోంది. 144/8తో మూడో రోజు ఆట మొదలుపెట్టిన ఆస్ట్రేలియాను మిచెల్ స్టార్క్ (58 నాటౌట్) ఆదుకున్నాడు. లియాన్ (2), జోష్ హేజిల్‌వుడ్ (17)తో కలిసి ఆసీస్ స్కోరును 207కు చేర్చాడు. దీంతో సఫారీల ముందు 282 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. ఈ టార్గెట్‌ను సఫారీలు ఛేదించడం కష్టమే అని అంతా అనుకున్నారు. ఈ అనుమానాలను నిజం చేస్తూ మిచెల్ స్టార్క్ ఆరంభంలోనే సౌతాఫ్రికాను దెబ్బతీశాడు. ర్యాన్ రికెల్టన్ (6)ను మూడో ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. దీంతో మరోసారి సఫారీ బ్యాటింగ్ కుప్పకూలుతుందని అంతా అనుకున్నారు. అయితే వియాన్ ముల్డర్ (27), మార్క్రమ్ ఇద్దరూ కలిసి 61 పరుగుల భాగస్వామ్యంతో రాణించారు. కానీ మరోసారి స్టార్క్ వచ్చి ముల్డర్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో సౌతాఫ్రికా 70/2తో కష్టాల్లో నిలిచింది.
మార్క్రమ్, బవుమా పట్టుదల
రెండు కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత మార్క్రమ్‌కు జతకలిసిన సఫారీ సారధి టెంబా బవుమా (65 నాటౌట్) అద్భుతమైన పట్టుదల చూపించాడు. గాయంతో కాలు నొప్పిగా ఉన్నా పట్టించుకోకుండా జట్టును విజయం వైపు నడిపించే బాధ్యతను పంచుకున్నాడు. వీళ్లిద్దరూ పెద్ద తప్పిదాలు చేయకుండా ఆడుతూ.. అదే సమయంలో స్కోరుబోర్డు ఎక్కడా ఆగకుండా నెమ్మదిగా పరుగులు జోడిస్తూ వెళ్లారు. ఈ క్రమంలోనే బవుమా హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే మార్క్రమ్ అద్భుతమైన సెంచరీ కంప్లీట్ చేశాడు. వీళ్లిద్దరి 143 పరుగుల అజేయ భాగస్వామ్యంతో సౌతాఫ్రికా 213/2 పరుగుల వద్ద మూడో రోజును ముగించింది. సఫారీలు గెలవాలంటే మరో 69 పరుగులు అవసరం.
స్మిత్‌కు గాయం..
ఈ మ్యాచులో స్టార్క్ బౌలింగ్‌లో బవుమా ఇచ్చిన క్యాచ్‌ను అందుకోబోయిన స్టీవ్ స్మిత్ తీవ్రంగా గాయపడ్డాడు. వ్యూహంలో భాగంగా స్మిత్‌ను స్లిప్స్‌లో కొంచెం ముందుకు నిలబెట్టాడు ప్యాట్ కమిన్స్. దీంతో తనవైపు దూసుకొచ్చిన బంతిని అందుకోవడంలో స్మిత్ తడబడ్డాడు. ఈ క్రమంలో బంతి బలంగా తగలడంతో స్మిత్ కుడిచేతి చిటికెన వేలు విరిగింది. ఫస్ట్ ఎయిడ్ చేసిన మెడికల్ టీం అతన్ని ఎక్స్‌రేల కోసం ఆస్పత్రికి తరలించింది.
ఎయిరిండియా మృతులకు సంతాపం..
మూడోరోజు ఆట మొదలయ్యే సమయంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద మృతులకు సంతాపం తెలియజేశారు. ఇరుజట్ల ప్లేయర్లు కాసేపు మౌనం పాటించడంతోపాటు చేతికి నల్ల బ్యాడ్జ్‌లు ధరించి ఆట ఆడారు.
స్కోరు బోర్డు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 212 ఆలౌట్
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 138 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 207 ఆలౌట్ (65 ఓవర్లు)
లబుషేన్ (సి)వెరీన్ (బి)యాన్సెన్ 22, ఖవాజా (సి)వెరీన్ (బి)రబాడ 6, కామెరూన్ గ్రీన్ (సి)ముల్డర్ (బి)రబాడ 0, స్మిత్ ఎల్బీడబ్ల్యూ (బి)లుంగి ఎంగిడి 13, హెడ్ (బి)ముల్డర్ 9, వెబ్‌స్టర్ ఎల్బీడబ్ల్యూ (బి)లుంగి ఎంగిడి 9, అలెక్స్ కేరీ ఎల్బీడబ్ల్యూ (బి)రబాడ 43, కమిన్స్ (బి)లుంగి ఎంగిడి 6, స్టార్క్ 58 నాటౌట్, నాథన్ లియాన్ ఎల్బీడబ్ల్యూ (బి)రబాడ 6, జోష్ హేజిల్‌వుడ్ (సి)మహరాజ్ (బి)మార్క్రమ్ 17; ఎక్స్‌ట్రాలు: 22.
వికెట్ల పతనం: 28-1, 28-2, 44-3, 48-4, 64-5, 66-6, 73-7, 134-8, 148-9, 207-10
బౌలింగ్: రబాడ (18-1-59-4), యాన్సెన్ (18-3-58-1), ముల్డర్ (8-1-18-1), లుంగి ఎంగిడి (13-1-38-3), కేశవ్ మహరాజ్ (6-1-17-0), ఎయిడెన్ మార్క్రమ్ (2-1-5-1)
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 213/2 (56 ఓవర్లు)
ఎయిడెన్ మార్క్రమ్ 102 నాటౌట్, ర్యాన్ రికెల్టన్ (సి)క్యారీ (బి)స్టార్క్ 6, వియాన్ ముల్డర్ (సి)లబుషేన్ (బి)స్టార్క్ 27, టెంబా బవుమా 65 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 13.
వికెట్ల పతనం: 9-1, 70-1
బౌలింగ్: మిచెల్ స్టార్క్ (9-0-53-2), జోష్ హేజిల్‌వుడ్ (13-0-43-0), ప్యాట్ కమిన్స్ (10-0-36-0), నాథన్ లియాన్ (18-3-51-0), బ్యూ వెబ్‌స్టర్ (4-0-11-0), ట్రావిస్ హెడ్ (2-0-8-0)






