దిగివ‌చ్చిన ద‌క్షిణాఫ్రికా కోచ్‌..టీమిండియాకు క్ష‌మాప‌ణ‌లు !

by velandi.Saikiran |

షుక్రి కాన్రాడ్. ఆ పదాలను ఉపయోగించినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి

దిగివ‌చ్చిన ద‌క్షిణాఫ్రికా కోచ్‌..టీమిండియాకు క్ష‌మాప‌ణ‌లు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: దక్షిణాఫ్రికాపై భారత జట్టు వన్డే సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. నిన్న వైజాగ్ వేదికగా 3వ వన్డేలో గ్రాండ్ విక్టరీ కొట్టిన భారత జట్టు, 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఈ సిరీస్ పూర్తయిన తర్వాత దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ ( Shukri Conrad) పశ్చాత్తాప పడ్డారు. భారత జట్టుకు దాదాపు క్షమాపణలు చెప్పేశారు. గువాహ‌టి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సందర్భంగా సఫారీ కోచ్ షుక్రి కాన్రాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్లేయర్లు సాష్టాంగ నమస్కారం చేసే వరకు డిక్లేర్ ఇవ్వబోమంటూ కామెంట్ చేశారు. ఆ సందర్భంగా గ్రోవెల్ అనే పదాన్ని వాడారు దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్.

అయితే ఆ వ్యాఖ్యలపై తాజాగా వివరణ ఇచ్చారు షుక్రి కాన్రాడ్. ఆ పదాలను ఉపయోగించినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి దురుద్దేశంతో ఆ కామెంట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. భారతీయులు అంటే తమకు అభిమానమని పేర్కొన్నారు. ఎవరిని కించపరచాలని ఆ పదం వాడలేదు, ఆ పదం స్థానంలో వేరే పదాన్ని వాడితే సరిపోయేది అంటూ వెల్లడించారు. ఇకపై తన భాష పట్ల చాలా జాగ్రత్తగా ఉంటానని వివరించారు. నా వ్యాఖ్యల నేపథ్యంలో వన్డే సిరీస్ ను ఇండియా చాలా కసిగా ఆడినట్లు వెల్లడించారు. ఇక ఇప్పుడు టి20 సిరీస్ కూడా చాలా ఆసక్తిగా మారబోతోందని స్పష్టం చేశారు.

Next Story