క్రికెట్‌కు సౌతాఫ్రికా ప్లేయర్ రిటైర్మెంట్

by velandi.Saikiran |   (  Updated:2026-04-02 12:01:03  IST  )

స్టార్ ఆటగాడు రస్సీ వాన్ డెర్ డాసన్ ( Rassie van der Dussen ) రిటైర్మెంట్ ప్రకటించాడు.

క్రికెట్‌కు సౌతాఫ్రికా ప్లేయర్ రిటైర్మెంట్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: దక్షిణాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టుకు సంబంధించిన స్టార్ ఆటగాడు రస్సీ వాన్ డెర్ డాసన్ ( Rassie van der Dussen ) రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశాడు. ప్రోటీస్ బోర్డు, తన సహచర ఆటగాళ్లు, అండగా నిలిచిన కోచ్ లు, అభిమానులకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు డాసన్. ఆలస్యంగా దక్షిణాఫ్రికా జట్టులోకి వచ్చినప్పటికీ అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యాడు. మంచి ప్రదర్శన కూడా కనబరిచాడు డాసన్.

డాసన్ కెరీర్ గణాంకాలు

37 సంవత్సరాల రస్సీ వాన్ డెర్ డాసన్ దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటి వరకు 71 వ‌న్డేలు ఆడాడు. ఇందులో 2657 పరుగులు సాధించాడు. అదే సమయంలో 57 టీ20 లలో ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా 1406 పరుగులు సాధించాడు. అటు 18 అంతర్జాతీయ టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన రస్సీ వాన్ డెర్ డాసన్.. 95 పరుగులు మాత్రమే చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా తన వంతు పాత్ర పోషించాడు. 2022 ఐపీఎల్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. ఇటు సౌతాఫ్రికా లీగ్ లో MI కేప్ టౌన్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

30 రోజుల్లో 10 టీ20లు.. భార‌త జ‌ట్టు బిజీ షెడ్యూల్ ఇదే

Next Story