- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
30 రోజుల్లో 10 టీ20లు.. భారత జట్టు బిజీ షెడ్యూల్ ఇదే
జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ మధ్య నెల రోజుల వ్యవధిలో మొత్తం 10 టీ20 మ్యాచ్ లు ఆడేలా షెడ్యూల్ ఫిక్స్ అయింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఐపీఎల్ టోర్నమెంట్ తో బిజీగా ఉన్న భారత క్రికెటర్లు...జూన్ నుంచి ఫుల్ బిజీగా ఉండనున్నారు. ఐపీఎల్ పూర్తికాగానే వరుసగా టీ20లు ఆడనుంది భారత జట్టు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ షెడ్యూల్ ప్రకారం 30 రోజుల్లోనే ఏకంగా 10 టీ20 మ్యాచ్ లు ఆడనుంది భారత్.
30 రోజుల్లోనే ఏకంగా 10 టీ20 మ్యాచ్ లు
జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ మధ్య నెల రోజుల వ్యవధిలో మొత్తం 10 టీ20 మ్యాచ్ లు ఆడేలా షెడ్యూల్ ఫిక్స్ అయింది. జూన్ 26, 28 తేదీలలో ఐర్లాండ్ జట్టుతో రెండు టీ20 లు ఆడనుంది భారత జట్టు. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఈ సందర్భంగా జులై ఒకటో తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ రెండు జట్ల మధ్య ఐదు టీ20 లు ఉంటాయి. ఇక జూలై 23, 25, 26 తేదీల్లో జింబాబ్వేతో కూడా తలపడుతుంది భారత్. అంటే ఓవరాల్ గా 30 రోజుల్లో మొత్తం 10 టీ20లు ఆడనుంది భారత జట్టు.
టీ20 సిరీస్ లు వరుసగా ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ 2026 సందర్భంగా రాణించిన క్రికెటర్లను సెలెక్ట్ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వైభవ్ సూర్యవంశీ లాంటి కుర్ర క్రికెటర్లను కూడా అవకాశం దక్కే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ టీ20 మ్యాచ్ ల నేపథ్యంలో ఎలాగైనా ఐపీఎల్ లో రాణించి జట్టులోకి రావాలని యంగ్ క్రికెటర్లు సిద్ధమవుతున్నారు.






