గంభీర్‌కు ముందుంది అసలు పరీక్ష : గంగూలీ

by Harish |

గంభీర్‌కు ముందుంది అసలు పరీక్ష : గంగూలీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ హయాంలో భారత జట్టు గతేడాది చాంపియన్స్ ట్రోఫీతోపాటు ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచింది. రెండు ఐసీసీ టైటిల్స్ గెలిచిన ఏకైక భారత హెడ్‌ కోచ్‌గా గంభీర్ నిలిచాడు. అయితే, గంభీర్‌కు అసలైన పరీక్ష పరీక్ష ముందుందని భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. 2027లో దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే వరల్డ్ కప్ అతనికి అసలైన పరీక్ష అని తెలిపాడు. ‘వైట్ బాల్ క్రికెట్‌లో 2027లో దక్షిణాఫ్రికాలో అతనికి అసలైన పరీక్ష ఎదురుకాబోతోంది. దక్షిణాఫ్రికా పరిస్థితులు అతన్ని పరీక్షిస్తాయి. కానీ ప్రస్తుత జట్టుతో అతను విజయం సాధిస్తాడని నాకు నమ్మకం ఉంది.’అని చెప్పాడు. అయితే, టెస్టు క్రికెట్‌లో గంభీర్, టీమ్ ఇండియా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నాడు. ‘రెడ్ బాల్ క్రికెట్‌లో పిచ్ గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఇంగ్లాండ్ సిరీస్‌లో అతడు పిచ్ విషయంలో ఏం చేయలేదు. ఫలితం ఎలా వచ్చిందో చూశాం. కాబట్టి స్వదేశంలో స్పిన్ పిచ్‌లను ఎక్కువగా సిద్ధం చేయించాల్సిన అవసరం లేదు. మంచి పిచ్‌లు ఉత్తమ ఫలితాలను అందిస్తాయి. గంభీర్ చాలా మంచి కోచ్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా అతడికి కాస్త సమయం ఇవ్వాలని నేను చెప్పా. ప్రస్తుతం వైట్ బాల్ కోచ్‌గా సక్సెస్ అయ్యాడు. అతడికి చాలా మంచి జట్టు ఉంది.’అని గంగూలీ చెప్పుకొచ్చాడు.


Next Story