- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత క్రికెట్ ఎవరి కోసం ఆగదు : గంగూలీ
రోహిత్, కోహ్లీ వంటి సీనియర్లు లేకుండానే శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత యువ జట్టు ఇంగ్లాండ్ గడ్డపై సత్తాచాటడంపై భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు.

దిశ, స్పోర్ట్స్ : రోహిత్, కోహ్లీ వంటి సీనియర్లు లేకుండానే శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత యువ జట్టు ఇంగ్లాండ్ గడ్డపై సత్తాచాటడంపై భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత క్రికెట్ ఎవరి కోసం ఆగదన్నాడు. ‘భారత క్రికెట్‌లో చాలా ప్రతిభ ఉంది. భారత క్రికెట్ ఎలా ఉందో ఒకసారి పరిశీలించండి. సునీల్ గవాస్కర్ వైదొలిగితే సచిన్ టెండూల్కర్ వచ్చాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నారు. వారు వెళ్లిపోయిన తర్వాత కోహ్లీ వచ్చాడు. కోహ్లీ వెళ్లాక యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్, గిల్ వచ్చారు. భారత క్రికెట్‌లో చాలా ప్రతిభ ఉంది. అది పెరుగుతూనే ఉంది. మాకు అద్భుతమైన వ్యవస్థ ఉంది. దేశీయ క్రికెట్ చాలా బలంగా ఉంది. ఐపీఎల్ కూడా అలాంటి వేదికే.’అని గంగూలీ చెప్పుకొచ్చాడు. సిరీస్ గెలవకపోయినప్పటికీ టీమిండియా ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 0/2 నుంచి డ్రా చేసుకోవడం, ఐదో టెస్టులో గెలిచి సిరీస్ సమయం చేయడం వరకు భారత్ అద్భుతమైన ప్రదర్శన చేసిందన్నాడు. రాహుల్,గిల్, జైశ్వాల్, పంత్, జడేజా, సుందర్ నిలకడగా రాణించారని ప్రశంసించాడు.






